WhatsApp and What’s Up meaning in Telugu – వాట్సాప్ మరియు వాట్స్ అప్ అర్ధాలు తెలుగులో: ప్రస్తుతం ఇంగ్లీష్ పదాలు కొన్ని మనం వాడుక భాషలో ఉపయోగిస్తున్నాం. కార్, టీవీ, ట్రావెల్ వంటివి సాధారణంగా ఉపయోగిస్తే కొన్ని కొత్త పదాలు మనల్ని అయోమయానికి గురిచేస్తుంటాయి. సామాజిక మాధ్యమాల్లో హాయ్, హలోకి బదులుగా వాట్స్ అప్ అనటం గమనించవచ్చు. చాలా మంది వాట్సాప్ అనే మొబైల్ యాప్ మరియు ఈ వాట్స్ అప్ అనే పదాల మధ్య వ్యత్యాసం తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఈ పదాల అర్ధాలు మరియు ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చో ఈ పోస్టులో తెలుసుకుందాం.
WhatsApp meaning in Telugu – వాట్సాప్ మీనింగ్ ఇన్ తెలుగు
ఇంటర్నెట్ సేవలు అందరికీ అందుబాటులోకి రాకముందు SMS మరియు MMS ద్వారా ఫోన్లో సందేశాలు పంపేవారు. గత దశాబ్ద కాలంలో ఇంటర్నెట్ విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు భారత దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు లభిస్తున్నాయి. అందుకే ప్రజలు SMS కు బదులుగా అధునాతనమైన మొబైల్ యాప్స్ తో సందేశాలు పంపుతున్నారు. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందినది వాట్సాప్ (WhatsApp). ఎవరినైనా పలకరించడానికి చెప్పే వాట్స్ అప్ అనే పదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పేరు పెట్టారు. వాట్సాప్ (WhatsApp) ప్రస్తుతం ఫేస్బుక్ (Facebook) కు చెందిన కంపెనీ.
వాట్సాప్ / వాట్సప్ (WhatsApp) = మొబైల్ ఫోన్ లో సందేశాలు పంపడానికి ఉపయోగించే ఒక మెసేజింగ్ యాప్
What’s Up meaning in Telugu – వాట్స్ అప్ మీనింగ్ ఇన్ తెలుగు
వాట్స్ అప్ (What’s Up) అనే పదాన్ని సహచరులు, స్నేహితులు, సహద్యోగులతో స్నేహపూర్వక సంభాషణల్లో వాడుతారు. ఎవరినైనా పలకరించడానికి లేదా సంభాషణ ప్రారంభించటానికి హాయ్ అని చెప్పినట్లు వాట్స్ అప్ (What’s Up) అంటారు. వాట్స్ అప్ అంటే సాధారణంగా ఏంటి సంగతి అనే అర్ధం వస్తుంది.
వాట్స్ అప్ (What’s Up) = ఏంటి, ఏం జరుగుతుంది, ఏంటి సంగతి, ఏంటి విషయం, ఇంకేంటి, ఏం నడుస్తుంది
ఎవరైనా మీతో వాట్స్ అప్ (What’s Up) అంటే దానికి బదులుగా మీరు “ఏం లేదు,” “ఏం లేదు, నువ్వే చెప్పు,” “నేను బాగున్నా, నీ సంగతేంటి?” “ఎప్పటిలాగే ఉన్నా,” “కొత్తగా చెప్పటానికి ఏం లేదు,” “వీకెండ్ కోసం ఎదురు చూస్తున్నా,” “ఫ్రెండ్స్ తో బయటకి వెళ్తున్నా” లాంటి అర్ధాలు వచ్చేలా ఏదైనా చెప్పవచ్చు.
సామాజిక మాధ్యమాల్లో వాట్స్ అప్ అనే పదాన్ని సంక్షిప్తంగా వేరేలా కూడా అంటారు. అందులో సర్వసాధారణమైనవి వాసప్ (wassup or wassap) మరియు సప్ (sup).