What about you meaning in Telugu – వాట్ అబౌట్ యు అంటే ఏమిటి?

✅ Fact Checked

What about you meaning in Telugu – వాట్ అబౌట్ యు అంటే ఏమిటి: మీరు ఎవరైనా కొత్త వారితో ఇంగ్లీష్ లో మాట్లాడితే సాధారణంగా “వాట్ అబౌట్ యు?” (What about you?) అనే ప్రశ్న ఎదురవుతుంది. చాలా మందికి తెలుగులో దీని అర్ధం తెలియకపోవచ్చు. ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఎలా సమాధానం చెప్పాలి అనే సంకోచం ఏర్పడుతుంది. అందుకే ఈ పోస్టులో మీరు ఇలాంటి ప్రశ్నలను ఎలా అర్ధం చేసుకోవాలి, సందర్భానుసారం ఎలా సమాధానం చెప్పాలో తెలియచేస్తున్నాము.

What about you meaning in Telugu

What about you meaning in Telugu – వాట్ అబౌట్ యు అంటే తెలుగులో అర్ధం ఏమిటి?

వాట్ అబౌట్ యు అంటే సందర్భానుసారం వేరువేరు అర్ధాలు ఉండవచ్చు. సాధారణంగా మీరేమి చేస్తున్నారు (what are you doing), మీ సంగతేంటి (what about you), లేదా మీరెలా ఉన్నారు (how are you) అనే అర్ధాలు వస్తాయి.

వాట్ అబౌట్ యు అంటే ఏమిటి?

వాట్ అబౌట్ యు (What about you) = మీ సంగతి ఏంటి?

ఈ వాక్యాన్ని వేరే సమాధానానికి కొనసాగింపుగా ఉపయోగిస్తారు కాబట్టి దీనికంటే ముందు వాళ్ళేమి చెప్పారనేది ఇక్కడ సందర్భం. ఉదాహరణకు మీరు ఎవరినైనా మీరెలా ఉన్నారు అని అడిగితే “నేను బాగున్నాను, వాట్ అబౌట్ యు” అంటారు. మీరెక్కడికి వెళ్తున్నారు అంటే “నేను షాపింగ్ కి వెళ్తున్నాను, వాట్ అబౌట్ యు” అంటారు. మీరేమి చేస్తున్నారు అంటే “నేను క్రికెట్ ఆడుతున్నాను, వాట్ అబౌట్ యు” అంటారు. మీరు వాట్ అబౌట్ యు అనే వాక్యాన్ని వేరు చేయకుండా చూసినప్పుడే వాళ్ళు ఏమడుగుతున్నారో అర్ధం అవుతుంది.

వాట్ అబౌట్ యు (what about you) అనే వాక్యాన్ని ఎలాంటి సందర్భాలలో వాడతారు?

వాట్ అబౌట్ యు (what about you) అనే వాక్యాన్ని మూడు సందర్భాలలో ఉపయోగిస్తారు.

  • ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు
    ఆఫీసులో ఒక వ్యక్తి తన సహోద్యోగి (colleague) తో ఇలా చెప్పాడు: “I’m taking 3 days leave, what about you?”
    అతను నేను లీవ్ (leave) తీసుకుంటున్నాను, నువ్వు కూడా లీవ్ తీసుకోవచ్చు కదా అని సలహా ఇస్తున్నాడు.
  • అభిప్రాయం తెలుసుకోవటానికి
    ఇద్దరు స్నేహితురాళ్ళు పార్టీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే ఒకావిడ ఇలా అంటుంది: “What about Ramya – Shall we invite her?”
    ఆమె వాళ్ళ స్నేహితురాలు రమ్యని కూడా పిలుద్దామా అని అభిప్రాయం అడిగింది.
  • క్షేమ సమాచారం తెలుసుకోవటానికి
    ఒక పాత స్నేహితుడు చాలా కాలం తరువాత ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నావు అని అడిగితే “I’m fine, what about you?” అన్నాడు. ఇక్కడ అతను కూడా నువ్వెలా ఉన్నావు అని అడుగుతున్నాడు.

వాట్ అబౌట్ యు (what about you) అనే వాక్యాన్ని సామజిక మాధ్యమాల్లో ఎలా వాడతారు?

వాట్ అబౌట్ యు (what about you) అనే వాక్యాన్ని SMS మెసేజీలు, వాట్సాప్ (Whatsapp) చాట్స్, సామజిక మాధ్యమాల్లో (social media) సంక్షిప్తంగా ఉపయోగిస్తారు. ఈ క్రింద తెలిపిన సంక్షిప్త పదాలన్నీ వాట్ అబౌట్ యు అనే వాక్యానికి బదులుగా ఉపయోగిస్తారు.

  • What about you
  • What about u
  • What abt u
  • Wbu

ఇవి కాకుండా “fine, what about you” అంటే నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు (లేదా మీరెలా ఉన్నారు) అని అర్ధం, “then what about you” అంటే మరి నీ సంగతేంటి అని అర్ధం.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment