Virtual meaning in Telugu – వర్చ్యువల్ అర్ధం తెలుగులో: మీరు సాంకేతిక రంగానికి సంబందించిన వార్తలు మరియు నూతన ఆవిష్కరణల గురించి చదివితే వర్చ్యువల్ అనే పదం తరచుగా కనిపిస్తుంది. ఈ పదాన్ని టెక్నాలజీ అభివృద్ధి చెందేకొద్దీ మరింతగా ఉపయోగిస్తున్నారు. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.
Virtual meaning in Telugu – వర్చ్యువల్ అర్ధం తెలుగులో
వర్చ్యువల్ అంటే తెలుగులో అవాస్తవ, అసహజ, పరోక్ష, సాపేక్ష అనే అర్ధాలు వస్తాయి. ఒక వ్యక్తి, వస్తువు, లేదా ప్రక్రియ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఉన్నట్లు ప్రతిసృష్టి చేయగలిగితే దానిని వర్చ్యువల్ అంటారు. సాధారణంగా కంప్యూటర్ లేదా టెక్నాలజీ సహాయంతో మనం ఏదైనా లేనిదాన్ని ఉన్నట్టు ప్రదర్శిస్తే దానిని వర్చ్యువల్ అంటారు. ఉదాహరణకు మొబైల్ ఫోన్ లో చేసే వీడియో కాల్ ను అవతలి వ్యక్తి 3D లో కనిపించేలా చేయగలిగితే అది వర్చ్యువల్ అవుతుంది. అలాగే ఏదైనా వీడియో గేమ్ మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు కాకుండా అందులో ఉండి ఆడుతున్నట్టు సృష్టిస్తే అది వర్చ్యువల్ అవుతుంది.
వర్చ్యువల్ (virtual) = అవాస్తవ, అసహజ, పరోక్ష, సాపేక్ష, భౌతికంగా లేనిది ఉన్నట్టు ప్రతిసృష్టి
అలాగే వర్చ్యువల్ అనే పదాన్ని వేరే సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు.
వర్చ్యువల్ ఇంటర్వ్యూ (virtual interview) | ఆఫీసుకి వెళ్లకుండా ఇంటర్వ్యూ లో పాల్గొనటం |
వర్చ్యువల్ ఇమేజ్ (virtual image) | అద్దం, లెన్స్, వ్యక్తి, లేదా వస్తువు మీద పడి రిఫ్లెక్ట్ అయిన కాంతి తరంగాలతో సృష్టించబడిన ఇమేజ్ |
వర్చ్యువల్ రియాలిటీ (virtual reality) | కంప్యూటర్ తో సృష్టించబడి, మనం ఏదైనా సాంకేతిక సహాయంతో ప్రభావితం చేయగలిగిన 3D ఇమేజ్ లేదా పర్యావరణం |
వర్చ్యువల్ మోడ్ (virtual mode) | ఏదైనా నిజమైన దానికి డిజిటల్ గా సృష్టించబడిన ప్రతిబింబం |
వర్చ్యువల్ మాన్ (virtual man) | ఒక నిజమైన వ్యక్తికి డిజిటల్ ప్రతిబింబం |
వర్చ్యువల్ హగ్ (virtual hug) | భౌతికంగా కలవకుండా సాంకేతికత సహాయంతో ఆలింగనం చేసుకుంటున్నట్లు అనుకరించటం |
వర్చ్యువల్ మీటింగ్ (virtual meeting) | భౌతికంగా కలవకుండా సాంకేతికత సహాయంతో మీటింగ్ లో పాల్గొనటం |
Virtual examples in Telugu – వర్చ్యువల్ ఉదాహరణలు
వర్చ్యువల్ అనే పదాన్ని ఈ క్రింద చూపించిన విధంగా సంభాషణల్లో ఉపయోగించవచ్చు.
- అతను వాస్తవికతకు దూరంగా వర్చ్యువల్ ప్రపంచంలో బ్రతుకుతున్నాడు.
- మా కంపెనీ ఇప్పుడు వర్చ్యువల్ గేమ్స్ తయారు చేయటంలో ముందంజలో ఉంది.
- ఆవిడ తన చనిపోయిన కూతురికి గుర్తుగా వర్చ్యువల్ ఇమేజ్ తయారుచేయిస్తుంది.
- నాకు వచ్చే వారం ఒక వర్చ్యువల్ ఇంటర్వ్యూ ఉంది.
ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.