Vibes meaning in Telugu – వైబ్స్ అర్ధం తెలుగులో

✅ Fact Checked

Vibes meaning in Telugu – వైబ్స్ అర్ధం తెలుగులో: వైబ్స్ (Vibes) అనేే పదాన్ని సాధారణంగా వైబ్రేషన్స్ (Vibrations) అనే పదానికి సంక్షిప్తంగా ఉపయోగిస్తారు. అందుకే చాలామంది వైబ్స్ అర్ధాన్ని ప్రకంపనలు, కంపనం, కదలిక అని అనువదిస్తారు. కానీ వైబ్స్ అంటే అనుభూతి మరియు వాతావరణం అనే అర్ధాలు కూడా వస్తాయి. వైబ్స్ అర్ధం, ఉదాహరణలు, మరియు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలుసుకుందాం.

vibes meaning in telugu

Vibes meaning in Telugu – వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు (వైబ్స్ అర్ధం తెలుగులో)

వైబ్స్ (Vibes) అనేే పదాన్ని ఒక వ్యక్తి లేదా ప్రదేశం యొక్క ప్రస్తుత స్వభావాన్ని తెలియజేసేందుకు వాడతాము. ఒక వ్యక్తి మూడ్ (ఆంతరంగిక భావం) లేదా ఒక ప్రదేశం యొక్క వాతావరణాన్ని వైబ్స్ అని చెప్పవచ్చు. అలాగే ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లేదా పూజ జరుగుతుంటే ఆ వాతావరణాన్ని కూడా వైబ్స్ అనే పదం ఉపయోగించి తెలియజేయవచ్చు. వైబ్స్ అనే పదాన్ని కేవలం మంచి లేదా ఆహ్లాదకరమైన వాతావరణానికే కాకుండా చెడు లేదా భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఉపయోగించవచ్చు.

వైబ్స్ (Vibes) = ప్రకంపనలు, కంపనం, కదలిక, అనుభూతి, వాతావరణం, అనుభవం, భావం

Morning vibes meaning in Telugu – మార్నింగ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. పగటి వేళలో గాలిలోకి లేచిన దుమ్ము, ధూళి అంతా నేల మీదకి చేరటంతో గాలి పరిశుభ్రంగా ఉంటుంది. వాహనాల రద్దీ లేకపోవటంతో నిశ్శబ్దంగా ఉంటుంది. ఉదయం వ్యాయామం చేయాలనుకునేవారికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుకే ఏదైనా పని ఉదయం మొదలుపెడితే శుభఫలితాలు ఉంటాయని నమ్ముతారు.

మార్నింగ్ వైబ్స్ (Morning vibes) = ఉదయం ఉండే నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం

Good vibes meaning in Telugu – గుడ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు అంతా మంచి జరుగుతుందనే భావన కలిగినప్పుడు దాన్ని గుడ్ వైబ్స్ అంటారు. ఇలాంటి భావన సాధారణంగా మన చుట్టూ ఉండే వ్యక్తులు, పరిస్థితులు, మరియు వాతావరణం వల్ల కలుగుతుంది.

గుడ్ వైబ్స్ (Good vibes) = శుభ శకునం

Marriage vibes meaning in Telugu – మ్యారేజ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

Marriage vibes అంటే పెళ్లి కళ అని అర్థం. పెళ్ళికూతురు కి, పెళ్ళికొడుకు కి పెళ్లి కళ వచ్చింది అని చెప్పే సందర్భంలో మ్యారేజ్ వైబ్స్ పదాన్ని వాడతారు. Wedding vibes అంటే పెళ్లి వాతావరణం అని అర్థం. ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంది అంటే కుటుంబ సభ్యులంతా పండుగ లాగా సంతోషంతో జరుపుకుంటారు.

మ్యారేజ్ వైబ్స్ (Marriage vibes) = పెళ్లి కళ

వెడ్డింగ్ వైబ్స్ (Wedding vibes) = పెళ్లి వాతావరణం

Temple vibes meaning in Telugu – టెంపుల్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

దేవాలయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి. భక్తులు దైవచింతనలో ఉంటారు. పురోహితులు వేదమంత్రాలు చదువుతూ పూజలు చేస్తుంటారు.

టెంపుల్ వైబ్స్ (Temple vibes) = దేవాలయాల్లో ఉండే ఆధ్యాత్మిక వాతావరణం

Festival vibes meaning in Telugu – ఫెస్టివల్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

పండుగల సమయంలో ఒకరకమైన ఆనందం, హడావిడి, అల్లరి కనిపిస్తుంది. కుటుంబమంతా ఒక చోట చేరి పూజలు, పిండి వంటలు, ఆటలతో సంతోషంగా పండుగలు చేసుకుంటారు.

ఫెస్టివల్ వైబ్స్ (Festival vibes) = పండుగ వాతావరణం

Evening vibes meaning in Telugu – ఈవెనింగ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

రోజంతా ఎండ, వేడి, కాలుష్యం, కంగారులో పరిగెడుతున్నట్టు అనిపించే కాలం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా ఆగినట్లు అనిపిస్తుంది. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

ఈవెనింగ్ వైబ్స్ (Evening vibes) = సాయంత్రం వేళలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం

Positive vibes meaning in Telugu – పాజిటివ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు

ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆరంభ ఫలితాలు, చుట్టూ ఉండే వ్యక్తులు మరియు పరిసరాలు శుభప్రదంగా ఉంటే మనల్ని మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తాయి.

పాజిటివ్ వైబ్స్ (Positive vibes) = శుభప్రదమైన వాతావరణం

ఇవి కాకుండా వైబ్స్ అనే పదాన్ని చాలా సందర్భాలలో ఉపయోగిస్తారు. బర్త్ డే వైబ్స్ (Birthday Vibes) అంటే పుట్టిన రోజు నాడు నెలకొనే వాతావరణం అని అర్థం. బ్యాడ్ వైబ్స్ (Bad Vibes) అంటే చెడు జ్ఞాపకాలు, చెడు వాతావరణం అని అర్థం.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment