Triglycerides meaning in Telugu – ట్రైగ్లిజరైడ్స్ అర్ధం తెలుగులో

✅ Fact Checked

Triglycerides meaning in Telugu – ట్రైగ్లిజరైడ్స్ అర్ధం తెలుగులో: ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) అంటే మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్ధాలు. ఆహారంలో ఉండే కొవ్వు పదార్ధాలు మొదట కొవ్వు కణాలలో ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ చేయబడతాయి, ఆ తర్వాత క్రమంగా రక్తంలోకి విడుదలవుతాయి. మన శరీరంలో కొలెస్ట్రాల్ గురించి తెలిపే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (LPT – Lipid Profile Test) మనకు ట్రైగ్లిజరైడ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తెలియజేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ గురించి పూర్తి వివరాలు ఈ పోస్టులో తెలుసుకుందాం.

triglycerides meaning in telugu

ట్రైగ్లిజరైడ్స్ ను శరీరం సహజసిద్ధంగా తయారుచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో వెంటనే అవసరంలేని కొవ్వును ట్రైగ్లిజరైడ్స్ రూపంలో భద్రపరుస్తుంది. శరీరం ఈ కొవ్వును మనం ఏదైనా పనిచేసే సమయంలో కావలసిన శక్తి కోసం ఇంధనంలా వినియోగిస్తుంది.

ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) = పని చేయటానికి కావలసిన శక్తి కోసం ఇంధనంలా ఉపయోగించటానికి శరీరం నిల్వ చేసే కొవ్వు

Hyper Triglycerides meaning in Telugu – హైపర్ ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి?

మన శరీరంలో అధికంగా ట్రైగ్లిజరైడ్స్ ఉంటే వాటిని హైపర్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం ఆహారం తీసుకున్న వెంటనే శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి అధికంగా ఉంటుంది, కానీ ఏదైనా పని చేసినప్పుడు వాటి శాతం తగ్గిపోతుంది. మనం అవసరానికి మించి ఆహారం తింటే హైపర్ ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడతాయి. ఇవి కొలెస్ట్రాల్ వంటి మిగిలిన కొవ్వు పధార్ధాలతో కలిసి రక్తనాళాల్లో పేరుకుపోతాయి. దీని వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ ట్రైగ్లిజరైడ్స్ లివర్ మరియు ప్యాంక్రియాస్ వంటి ఇతర అవయవాల్లో కూడా పేరుకుపోయి వాటి పనితీరుని దెబ్బతీస్తాయి.

VLDL Cholesterol meaning in Telugu

లైపోప్రోటీన్స్ మరియు కొవ్వు పధార్ధాలతో తయారైన చాలా రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. Very-low-density lipoprotein (VLDL) cholesterol లివర్ లో తయారుచేయబడి రక్తంలో విడుదలయి శరీర అవయవాలకు ట్రైగ్లిజరైడ్స్ అందేలా చేస్తుంది. VLDL cholesterol కూడా LDL cholesterol లాంటిదే. కానీ LDL cholesterol శరీర అవయవాలకు cholesterol అందజేస్తే, VLDL cholesterol శరీర అవయవాలకు ట్రైగ్లిజరైడ్స్ అందజేస్తుంది.

LDL Cholesterol meaning in Telugu

LDL cholesterol ను బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు, ఎందుకంటే ఇది రక్తనాళాలకు కొలెస్ట్రాల్ అందజేస్తుంది. ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయి అధిక రక్తపోటు, స్థూలకాయం, మరియు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

HDL Cholesterol meaning in Telugu

HDL cholesterol ను మంచి కొలెస్ట్రాల్ అంటారు, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ ను లివర్ కు చేరేలా చేస్తుంది. లివర్ అధిక కొలెస్ట్రాల్ ను శరీరం నుండి శుద్ధి చేస్తుంది. HDL cholesterol మన శరీరం లో పేరుకుపోయిన అనవసర కొలెస్ట్రాల్ ను నిర్మూలించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Triglycerides Level Chart in Telugu

లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఏ మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ మోతాదును నాలుగు భాగాలుగా విభజించారు. వాటిని కింద ఇచ్చిన ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ చార్ట్ (Triglycerides level chart) లో తెలుసుకుందాం.

ట్రైగ్లిజరైడ్స్ మోతాదు (mg/dl)కేటగిరీ
150 కంటే తక్కువసాధారణ లెవెల్ (Normal Level)
150-199బోర్డర్ లైన్ లెవెల్ (Borderline Level)
200-499హై లెవెల్ (High Level)
500 మరియు అధికంవెరీ హై లెవెల్ (Very High Level)
కొలెస్ట్రాల్ మోతాదును డెసీలీటర్ (dl) రక్తంలో మిల్లీ గ్రాముల (mg) కొలెస్ట్రాల్ గా కొలుస్తారు.

సాధారణ లెవెల్ లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణించవచ్చు. బోర్డర్ లైన్ లెవెల్ లో సాధారణ స్థితి కన్నా కాస్త ఎక్కువగా ఉన్నట్టు పరిగణించాలి. ఈ స్థితిలో ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. హై లెవెల్ లో ప్రమాద స్థాయిగా పరిగణించాలి. ఈ స్థితిలో డాక్టర్ సలహా పాటిస్తూ ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. వెరీ హై లెవెల్ లో ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అర్ధం. ఈ స్థితిలో కొంచెం అశ్రద్ధ చేసినా ప్రాణాలకే ప్రమాదం. మీ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని బట్టి చికిత్స తీసుకుంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

1 thought on “Triglycerides meaning in Telugu – ట్రైగ్లిజరైడ్స్ అర్ధం తెలుగులో”

  1. In 2020, I was diagnosed with hyper triglycerides. I completely changed my diet. Now I’m eating multigrain breakfast, protein-rich lunch, and healthy dinner. I keep track of my calorific intake and make sure that I don’t skip any meals. Now I’m healthier than others and has increased productivity. Thanks to internet that I can find all the information about diet. I advise everyone to follow a healthy diet to avoid problems in future.

    స్పందించు

Leave a Comment