Torchbearer meaning in Telugu – టార్చ్ బేరర్ మీనింగ్ ఇన్ తెలుగు: మీరు టార్చ్ బేరర్ అనే పదాన్ని చాలా సందర్భాలలో విని ఉంటారు. కానీ ఈ పదానికి అర్ధం మనలో చాలామందికి తెలియదు. టార్చ్ బేరర్ అంటే అర్ధం మరియు ఈ పదాన్ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
Torchbearer meaning in Telugu – టార్చ్ బేరర్ మీనింగ్ ఇన్ తెలుగు
టార్చ్ బేరర్ అనే పదాన్ని సాధారణంగా ముందుండి నడిపించేవాడు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా ఇదే ఉద్దేశ్యంతో హీరోని టార్చ్ బేరర్ అని పిలుస్తారు. అక్కడ సందర్భానుసారం ప్రతి తరంలో మార్పు కోసం ప్రయత్నించే వ్యక్తి ఒకడు ఉంటాడు, అతనే టార్చ్ బేరర్ అని చెప్తారు. ఒక ఉద్యమం లేదా పెను మార్పు రావాలంటే అందరిని ఒక లక్ష్యం వైపు పట్టుదలతో నడిపించే వ్యక్తి కావాలి, అతనే టార్చ్ బేరర్.
టార్చ్ బేరర్ (Torchbearer) = మార్గదర్శి (దిశానిర్దేశం చేయువాడు, దార్శనికుడు, లేదా దారి చూపు వాడు), అగ్గి దివిటీ మోసే వాడు
టార్చ్ బేరర్ (torchbearer) అనేది ఏకవచన పదం. దీనిని ఒక వ్యక్తిని ఉద్ధేశించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది ఉన్నప్పుడు దీని బహువచన పదం టార్చ్ బేరర్స్ (torchbearers) ఉపయోగిస్తారు. చాలా మంది ఈ వ్యత్యాసం తెలియక అన్ని సందర్భాలలో కేవలం టార్చ్ బేరర్ అనే పదాన్ని మాత్రమే వాడతారు.
ఒక లక్ష్య సాధన కోసం జరిగే ఉద్యమాన్ని ముందుండి నడిపించేవాళ్ళు, లేదా ఇతరులకు దిశానిర్దేశం చేసి గమ్యం చేరేందుకు సహకరించేవాళ్ళని టార్చ్ బేరర్స్ అంటారు.
ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.