SMH meaning in Telugu – ఎస్ ఎమ్ హెచ్ అర్ధం తెలుగులో

✅ Fact Checked

SMH meaning in Telugu – ఎస్ ఎమ్ హెచ్ అర్ధం తెలుగులో: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా సంక్షిప్త నామాల (acronyms) వినియోగం అధికంగా ఉంది. మనం మాట్లాడేటప్పుడు వివరంగా అన్ని విషయాలు చెప్తాము, కానీ ఆన్లైన్ లో టైప్ చేయటం కష్టం. పైగా మన హావభావాలు కూడా అవతలి వ్యక్తికి అర్ధం కావు. అందుకే సంక్షిప్తంగా చెప్పటానికి ఎక్రోనిమ్స్ మరియు హావభావాల కోసం ఈమోజీస్ ఉపయోగిస్తారు. ఇలా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, స్నాప్చాట్ తదితర చాటింగ్ యాప్స్ లో సాధారణంగా ఉపయోగించే పదం ఎస్ ఎమ్ హెచ్. ఈ పదం ఎప్పుడు ఎలా వినియోగించాలో ఉదాహరణలతో ఈ పోస్ట్ లో చూడండి.

smh meaning in telugu

SMH meaning in texting, chatting and messaging – ఎస్ ఎమ్ హెచ్ అర్ధం తెలుగులో

ఎస్ ఎమ్ హెచ్ (SMH) అనేది ఒక ఇనీషియలిజం (initialism). ఇనీషియలిజం అంటే తెలుగులో ప్రథమాక్షర సంకలనం. ఏదైనా పెద్ద వాక్యాన్ని త్వరగా పలకాలంటే అందులో ప్రతి పదంలో మొదటి అక్షరాన్ని కలిపి ఒక కొత్త పదంలా రాస్తారు. ఒకప్పుడు ఆర్మీ, మెడికల్, మరియు సైన్స్ లో త్వరగా ఆదేశాలు ఇవ్వటానికి ఇలాంటివి వినియోగించేవాళ్ళు. టెలిగ్రాఫ్ ద్వారా సంక్షిప్త సందేశాలు పంపటానికి కూడా ఇలాంటి పదాలు వాడేవారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఇనీషియలిజం తరచుగా వాడుతున్నారు.

ఎస్ ఎమ్ హెచ్ (SMH) అంటే షేక్ మై హెడ్ (Shake My Head) లేదా షేకింగ్ మై హెడ్ (Shaking My Head) అని అర్ధం. చాటింగ్ లో ఎస్ ఎమ్ హెచ్ ను నిరుత్సాహం, అసహ్యం, షాక్, అభిప్రాయ భేదం, లేదా నమ్మశక్యం కావట్లేదని చెప్పటానికి ఉపయోగిస్తారు. ఏదైనా విషయంలో చిరాకు, అసహనం, లేదా అభద్రతా భావాన్ని వ్యక్తపరచడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

ఎస్ ఎమ్ హెచ్ (SMH) = షేక్ మై హెడ్ (Shake My Head) / షేకింగ్ మై హెడ్ (Shaking My Head)

ఎస్ ఎమ్ హెచ్ (SMH) చాటింగ్ లో ఎలా ఉపయోగించాలి?

సాధారణంగా మనం తల అడ్డంగా ఊపుతూ నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తాము. కానీ చాటింగ్ లో ఆ అవకాశం ఉండదు కాబట్టి ఎస్ ఎమ్ హెచ్ అని రాసి, లేదా ఈమోజీతో, లేదా జిఫ్ (gif) ద్వారా భావాన్ని వ్యక్తపరచవచ్చు.

టెక్స్ట్ మెసేజ్ లో smh అని రాస్తే సరిపోతుంది. దీన్ని విడిగా ఉపయోగించవచ్చు లేదా ఏదైనా వాక్యంలో సందర్భానుసారంగా ఉపయోగించవచ్చు. ఈమోజీ ద్వారా చెప్పాలనుకుంటే ఫేస్ పాల్మ్ ఈమోజీని (🤦🤦‍♂️) ఉపయోగించవచ్చు. జిఫ్ లలో మీ భావానికి దగ్గరగా ఉన్నదాన్ని లేదా ఫన్నీ గా అనిపించేవి ఉపయోగించవచ్చు.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment