మహేష్ సరిలేరు నీకెవ్వరు హంగామా మొదలైంది

✅ Fact Checked

సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రెండు మంచి కాంబినేషన్ తో రూపొందుతున్నాయి. ఇంతకుముందు సినిమా టాక్, కలెక్షన్స్ దగ్గరే పోటీ ఉండేది, కానీ ఇప్పుడు అభిమానులు కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నారు. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ సినిమా కోసం రెడీ చేస్తున్న కటౌట్లు సోషల్ మీడియాల్లో రివీలవుతూ సందడి చేస్తున్నాయి. థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా జనవరి 5న జరగనున్న సరిలేరు నీకెవ్వరు భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి- మహేష్ కలిసి ఉన్న కటౌట్లను రెడీ చేస్తున్నారట. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు, పైగా భారీగా మెగా – ఘట్టమనేని ఫ్యాన్స్ దూసుకొస్తారు కాబట్టి పోలీసులు కూడా ఇప్పటినుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఎల్బీ స్టేడియంలో ఆఖరి నిమిషంలో ఈవెంట్ కి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడేందుకు హైదరాబాద్ పోలీస్ బలగాలు ప్లాన్ చేస్తున్నారట.

మహేష్ సరిలేరు నీకెవ్వరు హంగామా మొదలైంది

అందరికంటే ఎక్కువ టెన్షన్ మాత్రం చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిలో కనిపిస్తుంది. ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు తీసిన అనిల్ మొదటిసారి ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి భవిష్యత్తు ఈ చిత్రం ఫలితంపై ఆధారపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దూకుడు చిత్రానికి ముందు శ్రీను వైట్ల కూడా మీడియం రేంజ్ సినిమాలు తీస్తుండేవాడు. కానీ, ఆ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి కెరీర్ ని ఎలా మలుపు తిప్పబోతుందో తెలుసుకోవాలంటే సంక్రాంతి సీజన్ మొదలయ్యేవరకు వేచి చూడాలి. ఇంత ఒత్తిడిని ఎదుర్కొని అనిల్ రావిపూడి – అనిల్ సుంకర – దిల్ రాజు బృందం అభిమానులకు బ్లాక్ బస్టర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. మహేష్ ఆల్రెడీ సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఫలితం ఆయన్ని పెద్దగా ప్రభావితం చెయ్యకపోవచ్చు. కానీ, అనిల్ రావిపూడి, అనిల్ సుంకర, దేవి శ్రీ ప్రసాద్, రష్మిక కెరీర్లకి ఈ సినిమా విజయం చాలా కీలకం.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.