KCPD meaning in Telugu – కేసీపీడీ అర్ధం తెలుగులో

✅ Fact Checked

KCPD meaning in Telugu – కేసీపీడీ అర్ధం తెలుగులో: సోషల్ మీడియాలో మీమ్స్ లో కేసీపీడీ అనే పదం తరచుగా వినిపిస్తుంది. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే అది ఎలా ఉందో చెప్పటానికి మరియు ఎలివేషన్స్ ఇవ్వటానికి ఫ్యాన్స్ ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

KCPD meaning in Telugu – కేసీపీడీ అర్ధం తెలుగులో

కేసీపీడీ అనేది ఈ మధ్య బాగా వినపడుతున్న పదాల్లో ఒకటి. కేసీపీడీ (KCPD) అనేది ఒక ఇనీషియలిజం (initialism). ఇనీషియలిజం అంటే తెలుగులో ప్రథమాక్షర సంకలనం. ఏదైనా పెద్ద వాక్యాన్ని త్వరగా పలకాలంటే అందులో ప్రతి పదంలో మొదటి అక్షరాన్ని కలిపి ఒక కొత్త పదంలా రాస్తారు. ఒకప్పుడు సంక్షిప్త సందేశాలు పంపటానికి కూడా ఇలాంటి పదాలు వాడేవారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఇనీషియలిజం తరచుగా వాడుతున్నారు. కేసీపీడీ అనేది ఒక బూతు పదం. గతంలో ఒక చిన్న కుర్రాడు కేసీపీడీ – కు* చింపి పార దెం*తాం అంటే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాత దాన్ని టీవిలో కామెడీ షోస్ మరియు డ్యాన్స్ షోస్ లో కూడా ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అర్ధం తెలియకపోయినా చాలా మంది ఎలివేషన్స్ కోసం ఈ పదాన్ని ఉపయోగించటం మొదలుపెట్టారు.

కేసీపీడీ (KCPD) = కు* చింపి పార దెం*తాం

What is KCPD in Telugu memes?

KCPD ని ఇప్పుడు మీమ్స్ లో తరచుగా వాడుతున్నారు. దీనిని పైన చెప్పిన అర్థంలోనే రికార్డ్స్ అన్నీ తిరగరాస్తాం, దుమ్ము దులుపుతాం అనేలా ఉపయోగిస్తున్నారు. KCPD meaning bad word అని instagram లో మీమ్స్ గతంలో చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు కూడా మీమ్స్ లో ఇది బాగా ట్రెండింగ్ అవుతున్న పదం.

KCPD meaning in Godfather movie – గాడ్ ఫాదర్ సినిమాలో కేసీపీడీ అర్ధం

గతంలో ఒకసారి కేసీపీడీ అనే పదం బాగా వైరల్ అయింది. ఆ తరువాత గాడ్‌ ఫాదర్‌ సినిమా రిలీజ్ టైం లో మరొకసారి ఈ పదం ట్రెండింగ్ అయింది. గాడ్‌ ఫాదర్‌ సినిమాలో ఈ పదం మీద ఓ సీన్‌ కూడా ఉంది. అంతేకాకుండా కేసీపీడీ అంటూ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా వచ్చింది. ఇది బూతు పదం అయినప్పటికీ మెగా ఫ్యాన్స్‌ దానికి ఒక కొత్త డెఫినేషన్‌ తీసుకొచ్చారు. కేసీపీడీ అంటే ‘కొణిదెల చిరంజీవి ప్యూర్‌ డామినేషన్‌’ అంటూ మెగా ఫ్యాన్స్‌ నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. ఆ సినిమాలో విలన్ గా నటించిన సత్యదేవ్ ఆ సినిమా కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కొత్త అర్ధం చెప్పటంతో మెగా ఫ్యాన్స్ దాన్ని మరింత పాపులర్ చేశారు.

కేసీపీడీ (KCPD) = కొణిదెల చిరంజీవి ప్యూర్‌ డామినేషన్‌

KCPD meaning in Bhagavanth Kesari movie – భగవంత్ కేసరి సినిమాలో కేసీపీడీ అర్ధం

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కూడా ఈ పదం ఉపయోగించారు. ఆ సినిమా ట్రైలర్ లో కేసీపీడీ అనే పదాన్ని చూసిన ప్రేక్షకులు ఒకింత షాక్ కు గురయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది గాడ్ ఫాదర్ లా కేవలం కమర్షియల్ సినిమాగా కాకుండా మహిళా సాధికారత గురించి కూడా అవగాహన కల్పించే సినిమాగా భావించిన ప్రేక్షకులు ఇలాంటి డైలాగ్స్ ఉంటాయని ఊహించలేదు. ఆ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పదానికి కొత్త అర్ధం చెప్పారు. అది మీరు కింద చూడవచ్చు.

కేసీపీడీ (KCPD) = కేసరి చిచ్చా పండగ దావత్

ఏదేమైనా ఆ పదానికి ఉన్న బ్యాడ్ రెపుటేషన్ అయితే అంత తేలికగా పోదు. వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఈ పదాన్ని వాడుతున్నారు కాబట్టి దీనికి వేరే అర్ధం ఉందని అందరికీ అర్ధమవుతుంది. మీరు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ లేదా నందమూరి ఫ్యాన్స్ చెపుతున్న డెఫినిషన్ నిజమని నమ్మేసి ఈ పదాన్ని సాధారణ సంభాషణల్లో వాడకుండా ఉండటం మంచిది.

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment