Fish Names in Telugu – చేపల పేర్లు తెలుగులో

✅ Fact Checked

Fish Names in Telugu – చేపల పేర్లు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే రెండవ అతి పెద్ద సముద్ర తీర ప్రాంతం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో చేపలు అమితంగా ఇష్టపడే ఆహార పధార్ధాల్లో ఒకటి. అంతేకాకుండా మత్స్యకారులకు చేపలు పట్టడం జీవనాధారం. కానీ మనలో చాలా మందికి కొన్ని చేపల పేర్లు తెలుగులో తెలియదు. అందుకే ఈ పోస్ట్ లో మీకు కావలసిన సమాచారం అంతా పొందుపరుస్తున్నాము.

సాధారణంగా మనకి రెస్టారెంట్లలో ఉండే పేర్లు గుర్తుండిపోతాయి కానీ మత్స్యకారులు పిలిచే తెలుగు పేర్లు తెలియకపోవచ్చు. చేపల ఇంగ్లీష్ మరియు తెలుగు పేర్లు తెలుసుకుంటే మీరు cooking videos చూసి కొత్త రకం వంటకాలు ప్రయత్నించవచ్చు. క్రింద ఉన్న టేబుల్ లో మీరు Andhra Pradesh and Telangana fish names in Telugu చూడవచ్చు. సముద్రపు చేపలు మరియు మంచి నీటి చేపలు వేరువేరు పట్టికలలో ఇవ్వబడ్డాయి. మీరు fish names in English and Telugu కోసం చూస్తుంటే ఈ పేజీని బుక్ మార్క్ చేసుకోండి.

Fish names in Telugu and English

Fish Names in Telugu and English

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో దొరికే చాలా రకాల చేపల పేర్లు మీరు ఈ పోస్ట్ లో తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు salmon, apollo, tuna, rohu, basa, mackerel, murrel, tilapia, catla or katla, sardine, pomfret, seer, hilsa, king, eel etc. fish names in Telugu చూడవచ్చు.

Salmon Fish in Telugu

తెలుగులో Salmon fish ని మాగ మరియు బుడత మాగ అనే పేర్లతో పిలుస్తారు. సాల్మన్ ఫిష్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఇది పలు ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్లకు మోకాళ్ళలో జిగురు పెరుగుదలకు డాక్టర్లు సాల్మన్ ఫిష్, సల్మాన్ ఫిష్ ఆయిల్, సాల్మన్ ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ మొదలైనవి వాడమని సలహా ఇస్తుంటారు.

సాల్మన్ ఫిష్ (Salmon fish) = మాగ, బుడత మాగ

Apollo Fish in Telugu

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో అపోలో ఫిష్ అనే ఫుడ్ ఐటెం చాలా బార్స్ అండ్ రెస్టారెంట్స్ లో దొరుకుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్టార్టర్ గా అపోలో ఫిష్ దొరుకుతుంది. చాలా మంది ఇది ఒక రకమైన చేప అనుకుని పొరపాటు పడుతుంటారు. కానీ ఇది ఒక ఫుడ్ ఐటెం మాత్రమే. దీనిని తెలుగులో కూడా అపోలో ఫిష్ అనే పిలుస్తారు. దీనికి ప్రత్యేకమైన పేరేమి లేదు. అపోలో ఫిష్ తయారీలో కొరమీను, బొంకే, తుండవ, చిన్న గొరక లాంటి ముళ్ళు లేని చేపలను వాడతారు. వీటిని చేపల మసాలాతో కలిపి బ్యాటర్ గా చేసి ఆ తరువాత ఫ్రై చేస్తారు.

అపోలో ఫిష్ (Apollo fish) = కోరమీను చేపతో చేసిన ప్రత్యేకమైన వంటకం

కోరమీను తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇష్టమైన ఆహారం మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు రాష్ట్ర చేప కూడా. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో అతిదులకి ప్రత్యేకంగా కోరమీను ఫుడ్ ఐటమ్స్ పెడుతుంటారు.

State fish of Andhra Pradesh and Telangana = Stripped Murrel or Snakehead, locally known as Korameenu (కొరమీను)

Tuna Fish in Telugu

మన దేశంలో Tuna Fish కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. అందుకే దీన్ని చాలా ప్రాంతాల్లో అదే పేరుతో పిలుస్తారు. ఉత్తరాంధ్రలో ప్రజలు దీనిని తూర చేప అని పిలుస్తారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో టూనా ఫిష్ అనే సంబోధిస్తున్నారు.

టూనా ఫిష్ (Tuna fish) = టూరా చేప, తూర చేప, టూనా ఫిష్

Rohu Fish in Telugu

భారత దేశంలో ఎక్కువగా దొరికే చేపల్లో ఈ Rohu Fish (రోహు ఫిష్) కూడా ఒకటి. దీనిని తెలుగులో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు.

రోహు ఫిష్ (Rohu fish) = బొచ్చలు, రోహితాలు, ఙ్ఞాడు మీను, శీలవతి

Basa Fish in Telugu

Basa fish name in Telugu = బంక జెళ్ళ, కొలువ జెళ్ళ, పంగస

Mackerel Fish in Telugu

Mackerel fish name in Telugu = కనగర్తలు, కన్నంగదాత, కన్నంగడ్తి

Murrel Fish in Telugu

Murrel fish name in Telugu = కొరమీను, తుండ, కొరవ, మట్టలు, ఎర్రమట్ట, మొట్టు

Tilapia Fish in Telugu

Tilapia fish name in Telugu = తిలపియా ఫిష్

Catla or Katla Fish in Telugu

Catla fish name in Telugu = బొచ్చెలు, కృష్ణ బొచ్చె

Sardine Fish in Telugu

Sardine fish name in Telugu = కవళ్ళు, నూనె కవళ్ళు, తెల్ల కవళ్ళు

Pomfret Fish in Telugu

Pomfret fish name in Telugu = చందువ, సందువ
Black Pomfret = నల్ల చందువ
White Pomfret = తెల్ల చందువ

Seer Fish in Telugu

Seer fish name in Telugu = వంజరం, కొనేమ, మినీరం

Hilsa Fish in Telugu

Hilsa fish name in Telugu = పులస, పొలస, కిల్లలు

King Fish in Telugu

King fish name in Telugu = వంజరం, పెద్దమొట్ట

Eel Fish in Telugu

Eel fish name in Telugu = మలుగు చేప, మలుగు పాము, ములుగు చేప

Fish Names in Telugu

క్రింద ఉన్న టేబుల్ (పట్టిక) లో మీరు 175 చేపల పేర్లు ఇంగ్లీష్ మరియు తెలుగులో తెలుసుకోవచ్చు.

S. No. Fish Name in English Fish Name in Telugu చేపల పేర్లు తెలుగులో
1Anchovies, AnchovyNethallu, Pooroava, Kelba, Poravalluనేతల్లు, పూరోవ, కెల్బ, పొరవళ్ళు
2Banded GruntKaripeకరిపె
3BarracudaJellow, Seelabothuజెళ్ళు, పొడవు జెళ్ళు, శీలబోతు
4Barramundi, Gaint perch, Bekti, Asian SeabassPandugappaపండుగప్ప, పండు చేప, పండు మీను
5Basa Fish, PangusBanka jella, Koluva jella, Pangasaబంక జెళ్ళ, కొలువ జెళ్ళ, పంగస
6Bata, Labeo bataMosuమోసు
7Black kingfish, CobiaPeddla matta, Nala mattaపెడ్ల మట్ట, నల్ల మట్ట
8Black marlinNallaKommu konemuనల్లకొమ్ము కొనేము
9Blue Fin Travelly, Bluefin TravellyKurugu paarahకూరుగు పార
10Bluelined snapperKondalకొండల్
11Boal, freshwater shark, Wallago attuValaga, Walagha, Valugaవలగ, వలుగ
12Bombay Duck, BummaloVanamattalu, Vanmatta, Cocomutta, Cocosavari, Chukla chavaవనమట్టలు, కొకొ మట్టలు, కొకొ సావరి, చుక్కల చావలు
13Box fishGangiredduగంగిరెద్దు
14BreamsGorakaగొరక
15Brown shrimpGulla Royaluగుల్ల రొయ్యలు
16Bullet tunaToora chepaతూర చేప
17Bulls eyeBochelu, Yera chepaluబొచ్చెలు, ఎర్ర చేపలు
18Butterfish, MurrelBonkeబొంకే
19Carnatic carpPerka chepaపెర్క చేప
20CatfishJelalu, walaga, Tedi Jellaజెల్లలు, తేదీ జెల్లలు, వాలుగ చేప
21Chacunda Gizzard ShadsMadurullaమదురుల్ల
22Chinabar GoatfishRahtee gulavinda, rati gulavindaరాతి గులవింద
23ClamsChippalu, Vari mattalu, Boodidhigulla, Klaimpaచిప్పలు, వరి మట్టలు, బూడిద గుల్ల, క్లైమ్ప
24Clown knife fish, Feather backVollenka, Gooni mangalli katti, Chital, Mangala Katti(Humped feather back)ఒల్లెంక, గూని మంగలి కత్తి, చిత్తలు, మంగలి కత్తి
25Convict Surgeon FishMootahమూత, పచ్చ మూతలు, నీలం మూతలు
26CrabPeethaపీత
27Croacker, JewfishKora, Puli panna, Tella, Gorasaకచ్చలు, తెల్ల కచ్చలు, గొరస, గొరక, పులి పన్నా, చుక్కల గొరస, పూల గొరస
28Crucian carpBangaru teegaబంగారు తీగ
29Cuttle fishCharala Kalivinda, Kandavai, Buddakalivindaచారల కలివింద, కందవయి, బుడ్డ కలివింద
30DanioNooltuనూల్టు చేప
31Dart, snubnose pompanoKaduvai, Chanduvapara, Kokkarluకదువై, చందువ పార, కొక్కర్లు
32Dolphinfish, Mahi MahiPeda tura, Abanoos, Poppara meenuపెద్ద తూర, అబనూసు, పొప్పర మీను
33EelMaluguchepa, Malugu pamu, Mulugu chepaమలుగు చేప, మలుగు పాము, ములుగు చేప
34Emperor, MulaErimeenu, Karwaఎరమీను, కరవ
35Fin bream, Threadfin bream, Pink perchChalaneera kanti, Sallegantiచలనీర కాంతి, సల్లెగంటి
36Finned BullseyeDisco meenuడిస్కో మీను
37Five spot HerringKelailluకెలాయిలు
38Flathead, Bar eyed gobyEsuka dondu, Sotlamariఇసుక దొండు, సొట్టల మారి
39FlounderBepinalika, Namminalikaబేపి నాలిక, నమ్మి నాలిక
40Flying barbAsta pakkeఅష్ట పక్కి
41Flying FishPara, Kola, Parava meenuపారలు, పార చేపలు, కోల చేప, పరవ మీను
42Freshwater Pomfret, Red PacuRoopchandరూప్ చాంద్
43Freshwater GarfishKokare, konti, sora chepaకొకరు, కొంటి, సొర చేప
44Frigate tunaThikka Sorrahతిక్క సూర
45Fringescale sardineKowal, Nooneకోవాల్, నూనె
46Fullbeak, GarfishWadlan muku, Vadla mukku, Soodiవడ్ల ముక్కు, సూది చేపలు, సూదులు
47Gaint River PrawnNilkantapu royyaనీలకంఠపు రొయ్యలు
48Gangetic Koi, Climbing perch, GuramiGorasa / Kavaiyanగోరసలు, కవాయిలు
49Gas Cut, Grass CarpGaddi Chepa, Gaddi bochuగడ్డి చేప, గడ్డి బొచ్చు
50Giant River CatfishKeene jella, Multi jella, Nare jella,Cerebella, Valaga, Ingilai, Jellaకీనె జెల్ల, ముల్తి జెల్ల, నారె జెల్ల, సెరెబెల్ల, , వాలగ, ఇంగిలాయి, జెల్ల
51Giant Sea catfishNella jellaనెల్ల జెల్ల
52Giant Trevally, Giant Kingfish, Yellowfin jackPara, Jarradandree paraపార, జరందండ్రీ పార
53Glass barbGetchuగెచ్చులు
54GoatfishGulivindaగులివింద
55Golden snapperThundavaతుండవ
56Golden TrevallyPara, Polooso parah, Manjal Parahపార, పొలుసు పార, మంజల పార
57GouramiParaka, Gourami, Kun-geeపరక, గౌరమి, కుంజి
58Greas carp fish, CarpArju, Elamosa, Chittariఅర్జు, ఎల్మోస, చిత్తరి (చిత్తర్లు)
59Grouper, Reef codKomerlu, Muri meenu, Bontha కొమెర్లు, మురి మీను, బొంత
60GruntGorakka, Korakka, Karuppi, Karipiగోరక్కలు, కోరక్క, కరుపీ, కరిపీ
61Grunter, Silver GruntPanduGorakaపండు గొరక
62Half beakMudderu, Kolasa, Konga mukku, Kadurluముద్దేరు, కొలస, కొంగ ముక్కు, కదుర్లు
63Halibut, turbotEddunalikaఎద్దు నాలిక
64Herring FishPitta parigaపిట్ట పరిగలు
65Hilsa Shad, Palla Fish, Hilsha, Ellis, Hilsa, Hilsa herring, Ilish, Indian ShadIlasa, Pulasa, Polasa, Killaluఇలస, పులస, పొలస, కిల్లలు
66Horse Mackerel, Torpedo Scad, Yellowtail scadKaduru, Para, Manjal Para, Pulli para, Sora paraకదురు, పార, మంజల పార, పులి పార, సొర పార
67Indian carpletKodipeకోడిపె చేప
68Indian eelPasupu pamu, Tella pamuపసుపు పాము, తెల్ల పాము
69Indian Goat fishRathi goolivindaరాతి గులివింద
70Indian MackerelKanagarthalu, Kanaganthalu, Kannangadathaకనగర్తలు, కనగంతలు, కన్నంగడత
71Indian mottled eel, Spiny eelBommidala, Bommidayi, Kontemukku, Malugu pamuబొమ్మిడాయి, కొంటె ముక్కు, మలుగు పాము
72Indian Pellona, Indian HerringMorava, Ditcheleeమొరవ, డిచ్చెలీ
73Indian PotasiAkujellaఆకు జెల్ల
74Indian Salmon, Solmon, Indian solman, Threadfin, SalmonMaga, Budathamagaమాగ, బుడత మాగ
75Indian Scad MackerelPuliparaపులి పార
76Indian spiny turbotDodda Nangu, Kolli nangu, Noori nalakaదొడ్డ నాగు, కొల్లి నాగు, నూరి నాలిక
77Indian TarponKannegaకన్నెగ
78Indian Threadfin trevallyThokla paraతోకల పార
79Japanese threadfin breamChalaneer kanti, Yerra Gulivindaluచాలనీరు కంటి, ఎర్ర గులివిందలు
80John’s snapperEmpall, Samarluఎంపాలు, సామర్లు
81Kathala croakerPalligorasaపల్లిగొరస
82Katla, Catla, Bengal Carp, Indian CarpBotchi, Botcha, Botchee, Krishnabotchaబొచ్చెలు, కృష్ణ బొచ్చె
83KawakawaSorrahసూర
84King fish, Indo-Pacific king mackerelVanjiram, Peddah-mottahవంజరం, పెద్దమొట్ట
85Ladyfish, Sillago, Silver whitingIsaka Jantikulu, Surangi, Shorangi, Tella soringఇసక జంతికలు, సూరంగి, తెల్ల సూరంగి
86LeatherSkin, Talang QueenfishTholu Para, Palai meenతోలు పార, పాలి చేప
87Little tunnySura, Mayapusooraసూర, మాయపు సూర
88Lizard FishBade matta, Cade mottahబాడె మొట్ట, కాడె మొట్ట
89LoachJerri chepaజెర్రెలు
90LobsterKonjuకొంజు చేప
91Mackerel, Spanish Mackerel, King MackerelVanjaram, Kanagarthalu, Kannangadathaవంజరం, కనగర్తలు, కన్నంగడత
92Malabar AnchovyPooravaపురవ
93Malabar Leaf FishNallapanna, Pachapanna, Malabar fishనల్ల పన్నాలు, పచ్చ పన్నాలు, మలబార్ చేప
94Malabar TrevallyPara, Thollam para, Kodavaiపార, తొల్లమ్ పార, కోడాయి చేప
95Mangrove red snapperRatigorakaరాతిగొరక
96Milk sharkMatchala sorrah, sem sorrahమచ్చల సూర, సీమ సూర
97Milkfish, whiteMulletPala Bontha chepaపాల బొంత
98Moon fishChukkalachanduva, Ambutan-parahచుక్కల చందువా, అంబట్టన్ పారా
99Moontail BullseyeBotcheluబొచ్చలు
100Mrigal, White carpArju, Yerramosu, Bellalanosa, Mosuఎర్రమోస, అర్జు, పెద్ద అర్జు, బెల్లాలనోసా, మోసు
101Mud CrabPita, Manda peetaపీత, మంద పీత
102MulletBontha, Koniga, Kathiparega, Parigi, Kaniselu, Gold spot Mullet, kallu parigaబొంత, కొనిగ, కత్తి పరిగ, పరిగి, కనిసెలు, కల్లు పరిగ
103Mullet, Grey MulletBontha chepa, Bontha parigi, Kathipara, Konigaluబొంత చేప, బొంత పరిగి, కత్తి పార, కొనిగళు
104Mullet, Red MulletBontha Parigi, Koniga, Kathi parigoబోంతా పారాగి, కొంగ చేప, కత్తి పరిగ
105Murrel, Snakehead fishThunda, Korava, Mattaluతుండ, కొరవ, మట్టలు
106Murrel, Spotted SnakeheadErramatta, Mottu, korava, Poole Amalliఎర్రమట్ట, మొట్టు, కొరవ, పూలె అమాలి
107Murrel Fish, striped SnakeheadKorameenuకొరమీను
108Murrel, Gaint snakeheadMananguమానంగు
109MusselAlachippa, Alagulla, Pachi alchippaluచిప్పలు, ఆల్చిప్ప, ఆల్గుల్ల, పచ్చి ఆల్చిప్పలు
110Needle fishChinna pichika, Muddera, kolaచిన్న పిచిక, ముద్దెర, కోల
111OctopusDeyyapu kandavayaదెయ్యపు కందవయ
112Oil sardineKavalluకావళ్లు
113Olive barbGandeparakaగండి పరక
114Orange ChromideCashimera, Duvenna chepaకాశ్మీర, దువ్వెన చేప
115Orange Spotted grouperBonthaబొంత
116Ornate EmperorErimeenuఎరిమీను
117OysterMuthyala chippa, Dippakannu, Talapugullaముత్యాల చిప్పలు, డిప్పకన్ను, తలుపుగుల్ల
118Pabda, Indian Butter CatfishDukadamu, Theenuva, buggadammaదూకడము, తీనువ, బుగ్గడమ్మ
119Pabdah catfishGogliగోగ్లీ
120Parrot FishKili meenu, Sanee moiya , Chilukaకిలి మీను, సన్న మొయ్యలు, చిలుక
121Pearlspot, Green chromideCashimera, Mathaకాశ్మీర కరిమీను, మత్త
122PerchChamalu, Baikeeli, Kilipotu, Killipothu, Ganamచమళ్ళు, బైకిలి, కిల్లి పోతు, గణమ్ చేప
123Pomfret, PompanoChanduva, Attukula chanduvaచందువ, సందువ, నల్ల చందువ, తెల్ల చందువ, అతుకుల చందువ
124Pony Fish, Silver Belly FishKampalu, Kaaraకంపలు, కార, తెల్ల కార, నల్ల కార
125Prawn, ShrimpRoyyalu, Boli, Ettiరొయ్యలు, బోలి, ఎట్టి
126Rabbit fish, SpinefootWarawahవరవలు
127Razor edge, herringAaku chepaఆకు చేప
128Reba carpChittraiచిత్రాయి
129Red sea harrderChapu parigiచాపు పరిగి
130Red SnapperRangu, Thundava, Rangandi, Chaamaraరంగు, తుండవ, రంగడి, చామర
131Ribbon fish, Belt fish, Hair TailSevallu, Savada, Savallu, Chavada, Savidai, Nadippussavalluసేవాళ్లు, సావడ, సవళ్లు, చావడ, సవిడాయి, నడిపుసవళ్ళు
132RitaBondu, Bankiyeddu, Buddajella (Mahanandi)బొందు, బంకి ఎద్దు, బుడ్డ జెల్ల (మహానంది)
133River whiting, White CabooseIsuka Donduఇసుక దొందు
134Rock lobsterRati royyaరాతి రొయ్య
135Rohu Fish, Carp FishBocha, Rohita, Gnadu meenu, Silavathiబొచ్చలు, రోహితాలు, ఙ్ఞాడు మీను, శీలవతి
136Russell’s snapper, Blubberlip snapperGorasaగోరస
137Rusty jobfishThundavaతుండవ
138SailfishNemalipuri konemuనెమలిపురి కొనేము
139SardineKavalu, Noona Kavalluకవళ్ళు, నూనె కవళ్ళు, తెల్ల కవళ్ళు
140Saw Fish, GurYella, Lerluఎళ్ళ, లేర్లు
141SeabassPalagappaపాలగప్ప
142Seer Fish, Narrow barred spanish mackerelVanjaram, Konema, Mineeram, Sheelavathiవంజరం, కొనేమ, మినీరం, శీలవతి
143Seer fish, Indo pacific mackerelVanjaramవంజరం
144Seer fish, Streaked seerfishVanjaram, Magarasiవంజరం, మగరాసి
145Selar scadBetti paregiబెట్టి పరిగె
146Sharksora chepa, soraputtu, Palasora, Gedesoraసొర చేప, సొరపొట్టు, పాల సొర, గేదె సొర
147SicklefishThatti, Tharlamతట్టి, తర్లం
148Silver Bar FishKorliకొర్లి
149Silver Belly, Pony fishChanduva kara, Kodu baleచందువ కార, కోడు బాలే
150Silver Biddy, MojarrasPaiye, Jaggari, Vadagavaపయ్య, జగ్గరి, వడగవ
151Silver razor belly minnowChelaచేల
152Skipjack tunaSorrah, Namal sooraసొర, నామాల సొర
153SnapperThundavaతుండవ
154Sole Fish, Tongue soleKorra meenuకొరమీను
155Spinycheek GrouperMurimeenuమురిమీను
156Spotted croakerPandugorasaపండుగొరస
157Spotted Scat, spotted ButterfishChitsillo, Easupitta, Eetithippaచిటీసీలు, ఏసుపిట్ట, ఏటితిప్ప
158SquidKaamuta sanchulu, Kondavai, Kandavaya, Kolakalivindaకముత సంచులు, కొడవాయి, కందవయ, కోల కలివింద
159Stining catfishIngilayee, Marpuఇంగిలాయి, మార్పు
160Swimming CrabGelaipeeta, Salipetaగెలాయిపీట, సాలిపీట
161Swordfish, marlin familyKommu konemuకొమ్ము కొనేము
162Tiger prawnPappu royalu, Gaju royyaపప్పు రొయ్యలు, గాజు రొయ్యలు
163TilapiaQueiloo, Koyya pippali, China gorakha, Jalebi, Doobotchaక్విలూ చేప, కోయ పిప్పాలి, చిన్న గొరక, జలేబి, దూబొచ్చ
164Tongue Sole fishTambarattaతాంబరట
165Trigger fishMoori, Raathi yelakaమూరి, రాతి ఎలక
166TunaToora Chepaటూరా చెప, తూర చేప
167Turbot, Indian spiny turbotYeddu naalikaఎద్దు నాలిక
168Whip-tail sting ray, Ray fishTenku, Tenka, Teki, Belugiri, Tarukuteki, Mullutekuటెంకు, టెంకలు, టెకి, బెలుగిరి
169White fish, False trevally, JumperfishSadumiసదుమి
170white prawnsTella Royalu, Boliతెల్ల రొయ్యలు, బోలి
171Whiting, Lady fishTella Surangiతెల్ల సూరంగి
172Wild Common CarpGundu Chepa, Bangaru teegaగుండు చేప, బంగారు తీగ
173wolf herring, DorabMullu valava, Mullu valaముళ్ళు వలవ, ముళ్ళు వాళ
174yellow goatfishPasupu gulivindaపసుపు గులివింద
175Yellowfin TunaSurai, Pasupu thura, Recca sooraచూర, పసుపు తూర, రెక్క సూర

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment