Bestie meaning in Telugu – బెస్టీ అర్ధం తెలుగులో

✅ Fact Checked

Bestie meaning in Telugu – బెస్టీ అర్ధం తెలుగులో: కొన్ని పదాలు మనకు అంతగా తెలియకపోయినా సామాజిక మాధ్యమాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో బెస్టీ అనే పదం సర్వసాధారణం అయిపోయింది. ఇది స్నేహితులని ఉద్దేశించి ఉపయోగిస్తారు. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

Bestie meaning in Telugu – బెస్టీ అర్ధం తెలుగులో

జీవితంలో అందరికీ స్నేహితులు అవసరం. కొందరు స్నేహితులు కాలక్షేపానికి పరిమితం అయితే, కొందరు మాత్రం వ్యక్తిగత విషయాలు పంచుకునేంత దగ్గరవుతారు. అలా సన్నిహితంగా ఉంటూ, అన్ని విషయాలూ పంచుకునేంత స్వేచ్ఛ ఉన్న స్నేహితులను బెస్టీ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని బెస్ట్ ఫ్రెండ్ కు షార్ట్ ఫార్మ్ అనుకోవచ్చు. కానీ దీన్ని బంధువుల విషయంలో కూడా ఉపయోగించటం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి బెస్టీ అంటే బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు అనే అర్ధంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

బెస్టీ (bestie) = ఆప్త మిత్రులు, సన్నిహితులు, ఇష్టమైన స్నేహితులు, ప్రియమైన వ్యక్తి

ఈ పదాన్ని లింగ బేధం లేకుండా ఆడ, మగ ఇద్దరికీ ఉపయోగిస్తారు.

Bestie forever meaning in Telugu – బెస్టీ ఫరెవర్ అర్ధం తెలుగులో

బెస్టీ ఫరెవర్ అనే పదాన్ని ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా హ్యాష్ ట్యాగ్స్ రూపంలో ఈ పదాన్ని వాడుతున్నారు.

బెస్టీ ఫరెవర్ (bestie forever) = చిరకాల ప్రాణ స్నేహితులు, ఎప్పటికీ ఆప్త మిత్రులు

బెస్టీ లాగే బెస్టీ ఫరెవర్ కూడా లింగ బేధం లేకుండా ఆడ, మగ ఇద్దరికీ ఉపయోగించవచ్చు.

Bestie examples in Telugu – బెస్టీ ఉదాహరణలు తెలుగులో

బెస్టీ అనే పదాన్ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించవచ్చో ఈ క్రింద తెలిపిన ఉదాహరణల్లో చూడవచ్చు.

  • నా బెస్టీ చాలా కాలం తరువాత ఈ వీకెండ్ కలవబోతుంది.
  • అజయ్ గాడి బెస్టీ ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు.
  • తన బెస్టీ పెళ్లి పనుల్ని రమ్య దగ్గరుండి చూసుకుంటుంది.
  • వాళ్ళు నా బెస్టీ తో సరిగా మాట్లాడరు. అందుకే నేను కూడా అవాయిడ్ చేస్తున్నాను.

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment