Surrogacy meaning in Telugu – సరోగసి అర్ధం తెలుగులో

✅ Fact Checked

Surrogacy meaning in Telugu – సరోగసి అర్ధం తెలుగులో: సరోగసి అనే పదం సినిమాలు లేదా వార్తల్లో తరచుగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా సెలెబ్రిటీలు సరోగసి పద్ధతిలో గర్భం దాల్చారని తెలిస్తే వారి అభిమానులు వెంటనే దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

ఈ మధ్యకాలంలో సరోగసి అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. సరోగసినే తెలుగులో అద్దె గర్భం అంటున్నారు. సెలబ్రిటీలు ఎక్కువగా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కంటున్నారు. ముఖ్యంగా ఈ ధోరణి బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎక్కువగా కనిపిస్తోంది. తొమ్మిది నెలలు బిడ్డను మోయడం, గర్భం ధరించడం వల్ల శరీరాకృతి దెబ్బతినడం, ప్రసవం ద్వారా పొట్టపై వచ్చే మార్కులు ఇలాంటి బ్యూటీ కారణాల వల్ల చాలా మంది సెలబ్రిటీలు సరోగసి పద్ధతి ద్వారా బిడ్డల్ని కంటున్నారు.

Surrogacy meaning in Telugu – సరోగసి అర్ధం తెలుగులో

అద్దె గర్భం ద్వారా పిల్లలు కనే పద్ధతిని సరోగసి అంటారు. వేరే దంపతులకు చెందిన బిడ్డను మరొక మహిళ మోస్తుంది. భర్త నుండి వీర్యం, భార్య నుండి అండాన్ని తీసి ల్యాబ్ లో ఫలదీకరణం చేయించి ఆ పిండాన్ని మరో మహిళ గర్భంలో ప్రవేశపెడతారు. 9 నెలలు ఆ పిండం అద్దె గర్భంలోనే పెరిగి ప్రసవం అయ్యాక దంపతులకు అప్పగించాల్సి ఉంటుంది. సరోగసి పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళకు ఆ బిడ్డపై ఎలాంటి హక్కులూ ఉండవు. అండం, వీర్యం ఇచ్చిన వారే ఆ బిడ్డకు చట్టప్రకారం తల్లిదండ్రులు అవుతారు.

సరోగసి (surrogacy) = అద్దె గర్భం ద్వారా పిల్లలు కనే పద్ధతి

పిల్లలు లేక చాలా మంది దంపతులు మాసికంగా, శారీకంగా కుంగిపోతున్నారు. ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇతర కారణాలు.. ఎంతోమంది స్త్రీలను అమ్మతనానికి దూరం చేస్తున్నాయి. ఇలాంటి వారందరికీ IVF, సరోగసీ వరం అనే చెప్పాలి. చాలా మంది సెలబ్రిటీలు 35 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు. ఆ వయస్సులో గర్భం దాల్చడం కొందరిలో కష్టంగా మారుతోంది. పీసీఓడీ కారణాలు, గర్భాశయ ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య కారణాల వల్ల గర్భం ధరించడం అసాధ్యం కావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కంటున్నారు.

సరోగసి పద్ధతిని ఎంచుకోవడానికి ముఖ్య కారణాలు

సరోగసీ పద్దతిని ఎంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి  

  • పదే పదే గర్భస్రావం అవ్వటం వల్ల సంతాన లేమి సమస్య తో బాధపడే పెళ్ళైన దంపతులు
  • కొన్ని ఆరోగ్య కారణాల వల్ల  గర్భం దాల్చటం అసంభవం అయ్యినప్పుడు 
  • సర్జరీ లేదా ఇతర ఆరోగ్య కారణాల వల్ల గర్భాశయం ను తొలిగించినపుడు  
  • తమ వంశంలో జన్యుపరమైన లోపాలు ఉన్న వారు 
  • స్వలింగ సంపర్కులైన మగ దంపతులు లేదా ఆడ దంపతులు తమకు సంతానం కావాలి అని అనుకున్నప్పుడు 
  • కేవలం ఒక మగ వ్యక్తి పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనాలి అని అనుకున్నప్పుడు 
  • కేవలం ఒక మహిళ పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనాలి అని అనుకున్నప్పుడు సరోగసీ పద్దతిని ఎంచుకుంటారు 

Surrogate meaning in Telugu – సరోగేట్ అర్ధం తెలుగులో

సరోగసీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ట్రెడిషనల్ సరోగసీ రెండు జెస్టేషనల్ సరోగసీ. ట్రెడిషనల్ సరోగసీలో కేవలం భర్త యొక్క వీర్యంను గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ పద్దతిని ఇంట్రాయుటరైన్ ఇంసెమినషన్ (intrauterine insemination – IUI) అని అంటారు. కొన్ని సందర్భాలలో భర్త వీర్యం కాకుండా డోనర్ వీర్యం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సర్రోగేట్ 9 నెలలు మోసి బిడ్డను కంటుంది. జెస్టేషనల్ సరోగసీ లో భర్త వీర్యం లేదా డోనర్ వీర్యం, భార్య ఎగ్స్ లేదా డోనర్ ఎగ్స్ తీసుకొని IVF (in vitro fertilization) అనే పద్దతి ద్వారా కృత్రిమంగా ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో ను తయారు చేస్తారు. ఇలా తయారు అయిన బిడ్డను (ఎంబ్రియో) గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ కడుపులో పెంచుతారు.

సర్రోగేట్ (surrogate) = గర్భం దాల్చడానికి ఎన్నుకోబడ్డ మహిళ

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment