Integrity meaning in Telugu – ఇంటెగ్రిటీ అర్ధం తెలుగులో

✅ Fact Checked

Integrity meaning in Telugu – ఇంటెగ్రిటీ అర్ధం తెలుగులో: ఇంటెగ్రిటీ అనే పదం ఉద్యోగం మరియు వ్యక్తిత్వ వికాసానికి సంబందించిన సంభాషణల్లో తరచుగా వినిపిస్తుంది. ఈ పదం యొక్క అర్ధం మరియు దీనిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలియజేస్తున్నాము.

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఇంటెగ్రిటీ అనే పదం ఇప్పటికే విని ఉంటారు. ఇది ఉద్యోగం మరియు వ్యక్తిత్వ వికాసానికి సంబందించిన సంభాషణల్లో చూస్తుంటాం. మీలో చాలామంది ఈ పదం యొక్క అర్ధం తెలియక ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది దీనిని ఏ సందర్భంలో వాడాలో తెలియక తికమక పడుతుంటారు. ఈ పదం అర్ధంతో పాటు దీనిని ఎలాంటి సందర్భాలలో ఎవరితో మాట్లాడేటప్పుడు ఉపయోగించవచ్చో ఈ పోస్టులో మీకు ఉదాహరణలతో తెలియజేస్తున్నాము.

Integrity meaning in Telugu – ఇంటెగ్రిటీ అర్ధం తెలుగులో

ఇంటెగ్రిటీ అంటే తెలుగులో సమగ్రత అని అర్ధం. దీనిని సాధారణంగా ఐకమత్యం, చిత్తశుద్ధి, కలిసి ఉండటం, నిజాయితీ, మరియు అవిభాజ్య స్థితిని ఉద్దేశించి కూడా ఉపయోగిస్తారు. ఇంటెగ్రిటీ అనే పదాన్ని ఒక సంస్థ లేదా వ్యవస్థలో విలువలు పాటిస్తూ పనిచేసే ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడటానికి ఉపయోగిస్తారు. అలాగే దేశ ప్రగతి మరియు సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా ఈ పదాన్ని వాడతారు. అందుకే కొన్ని సందర్భాలలో పోలీసులు మరియు సైనికుల కోసం ఈ పదం ఉపయోగించినప్పుడు ఇది దేశ భక్తికి సంకేతంగా అనిపిస్తుంది.

ఇంటెగ్రిటీ (integrity) = సమగ్రత (samagrata)

Integrity is everything meaning in Telugu – ఇంటెగ్రిటీ ఈజ్ ఎవిరీథింగ్ అర్ధం తెలుగులో

ఇంటెగ్రిటీ అనే పదాన్ని నిజాయితీ, క్రమశిక్షణ, నైతిక విలువలు, నిబద్ధత, విశ్వాసపాత్రత మొదలైన లక్షణాలన్నిటిని ఉద్దేశించి ఉపయోగిస్తారు. సమగ్రత అంటే మొత్తం అని అర్ధం. ఇంటెగ్రిటీ ఈజ్ ఎవిరీథింగ్ అంటే సమగ్రతలో అన్నీ ఉంటాయని అర్ధం వస్తుంది.

ఇంటెగ్రిటీ ఈజ్ ఎవిరీథింగ్ (integrity is everything) = సమగ్రతే సర్వస్వం

Integrity examples – ఇంటెగ్రిటీ ఉదాహరణలు

ఇంటెగ్రిటీ అనే పదాన్ని సందర్భానుసారం క్రింది ఉదాహరణల్లో చూపించిన విధంగా ఉపయోగించవచ్చు.

  • అతని ఇంటెగ్రిటీ వల్ల అతనికి ప్రమోషన్ వచ్చింది.
  • సైనికులు దేశ ఇంటెగ్రిటీని కాపాడతారు.
  • ఇంటెగ్రిటీ లేని వాళ్ళ దగ్గర నిజాయితీ ఆశించకూడదు.

ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment