Teetotaler meaning in Telugu – టీటోటలర్ అర్ధం తెలుగులో: కొన్ని పదాలు వినటానికి విచిత్రంగా అనిపించవచ్చు. వాటి అర్ధాలు మనం ఊహించి చెప్పటం చాలా కష్టం. టీటోటలర్ కూడా అలాంటి క్లిష్టమైన పదం. సాధారణంగా ఈ పదం మనం వాడుక భాషలో తరచుగా వినకపోవచ్చు కానీ ఆంగ్లములో ఇది బాగా ప్రాచుర్యం పొందిన పదం. మీరు కూడా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, స్నాప్చాట్ తదితర చాటింగ్ యాప్స్ లో ఈ పదాన్ని విని ఉండవచ్చు. ఈ పదం ఎప్పుడు ఎలా వినియోగించాలో ఉదాహరణలతో ఈ పోస్ట్ లో చూడండి.
Teetotaler meaning in Telugu – టీటోటలర్ అర్ధం తెలుగులో
టీటోటలర్ అంటే ఎప్పుడూ మద్యం సేవించని వ్యక్తి అని అర్ధం. వీరు మద్యం సేవించకపోవటానికి ఆరోగ్య సంబంధమైన, మతపరమైన, కుటుంబ, లేదా సాంఘిక కారణాలు ప్రభావితం చేసి ఉండవచ్చు. అలాగే టీటోటలర్ అంటే జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ మద్యం తీసుకొని వారు అవ్వవలసిన అవసరం లేదు. వీరు ఏదైనా కారణం వల్ల మద్యపానం ఆపేసి ఉండవచ్చు. కానీ అప్పుడప్పుడు మద్యం తాగేవాళ్ళు, లేదా మద్యం తాగకూడదు అని బలంగా నిర్ణయం తీసుకొని వాళ్ళని టీటోటలర్ అని పిలవరు. టీటోటలర్ అంటే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా పూర్తిగా మద్యపానానికి దూరంగా ఉంటారు.
టీటోటలర్ (Teetotaler) = ఎప్పుడూ మద్యం సేవించని వ్యక్తి
Teetotalism meaning in Telugu – టీటోటలిజం అర్ధం తెలుగులో
టీటోటలిజం అంటే మద్యపానానికి దూరంగా ఉండటం. ఎవరైనా వారి జీవనశైలి మార్చుకుని మద్యపానానికి సంబంధించిన అలవాట్లను పూర్తిగా వదిలేస్తే, వారు టీటోటలిజం అవలంబిస్తున్నారని చెప్పవచ్చు.
టీటోటలిజం (Teetotalism) = మద్యపానానికి దూరంగా ఉండటం
Teetotaler examples in Telugu – టీటోటలర్ ఉదాహరణలు తెలుగులో
టీటోటలర్ అనే పదాన్ని సాధారణ సంభాషణల్లో ఎలా ఉపయోగించాలో క్రింద తెలిపిన ఉదాహరణల్లో చూడవచ్చు.
- నేను ఇప్పుడు టీటోటలర్. పూర్తిగా మద్యం మానేశాను.
- మా మామయ్య టీటోటలర్. జీవితంలో ఎప్పుడూ ఒక చుక్క మద్యం కూడా తాగలేదు.
- అతను యాక్సిడెంట్ తరువాత టీటోటలర్ గా మారిపోయాడు. ఇప్పుడు స్నేహితులతో సిట్టింగ్స్ కి కూడా రావట్లేదు.
- రాధిక వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తను టీటోటలర్ కావాలని పట్టుబడుతుంది.
ఇలాంటి జనరల్ నాలెడ్జ్, డబ్బు సంపాదించే మార్గాలు, వ్యాపార అవకాశాలు, ఆరోగ్యవంతంగా బరువు తగ్గే సమాచారం కోసం తెలుగు రష్ సైట్ ని ఫాలో అవ్వండి.