Executant meaning in Telugu – ఎగ్జిక్యూటెంట్ అర్థం తెలుగులో: ఎగ్జిక్యూటెంట్ (Executant) అనే పదం చాలా అరుదుగా వినబడుతుంది. ఎగ్జిక్యూట్ (Execute) అనే పదం మనం రోజువారీ సంభాషణల్లో ఉపయోగిస్తాం, కానీ ఎగ్జిక్యూటెంట్ అర్ధం మనలో చాలామందికి తెలియదు. ఈ పదం యొక్క అర్ధం మరియు ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో ఈ పోస్టులో తెలుసుకుందాం.
Executant meaning in Telugu – ఎగ్జిక్యూటెంట్ మీనింగ్ ఇన్ తెలుగు
ఎగ్జిక్యూటెంట్ (Executant) అంటే కార్య నిర్వాహకుడు, పనిచేసేవాడు, కార్యాన్ని జరిపించువాడు అని అర్ధం. ఎగ్జిక్యూటెంట్ ఏదైనా పనిని స్వయంగా తానే చేస్తాడు. అందుకే అతన్ని పాత్రధారి అని కూడా అంటారు. అలా కాకుండా ఎవరిచేతనైనా పని చేయిస్తే అతను సూత్రధారి (Executor) అవుతాడు. ఎగ్జిక్యూటెంట్ పెద్దగా ఆలోచించకుండా, ఎదురు ప్రశ్నలు వేయకుండా చెప్పిన పని చేస్తాడు.
ఎగ్జిక్యూటెంట్ (Executant) = కార్య నిర్వాహకుడు, పనిచేసేవాడు, కార్యాన్ని జరిపించువాడు, పాత్రధారి
Executor meaning in Telugu – ఎగ్జిక్యూటర్ మీనింగ్ ఇన్ తెలుగు
ఎగ్జిక్యూటర్ (Executor) అనే పదాన్ని సాధారణంగా న్యాయ శాస్త్ర (LAW) సంబంధిత విషయాల్లో వాడతాము. ఎగ్జిక్యూటర్ అంటే తెలుగులో సూత్రధారి అని అర్థం. ఎగ్జిక్యూటర్ తన సలహాలు సూచనలతో దిశానిర్దేశం చేసి పాత్రదారులతో పని చేయిస్తాడు. చేసే పనిలో సత్ఫలితాలు సాధించటం సాధారణంగా ఎగ్జిక్యూటర్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
ఎగ్జిక్యూటర్ (Executor) = సూత్రధారి, దిశానిర్దేశం చేయువాడు, సలహాలు సూచనలు ఇచ్చేవాడు
Executant(ex) & Claimants(cl) meaning in Law in Telugu – న్యాయశాస్త్రం ప్రకారం ఎగ్జిక్యూటెంట్ & క్లైమెంట్ అర్ధాలు తెలుగులో
ఒక వ్యక్తి మరణానంతరం అతని ఆస్తిని వీలునామా ప్రకారం కార్యనిర్వాహకుడు (ఎగ్జిక్యూటెంట్) హక్కుదారులకు (క్లైమెంట్) పంచుతాడు. ఆ ఆస్తిని ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎంత పంచాలో వీలునామాలో తెలిపిన వివరాల ప్రకారం ఎగ్జిక్యూటెంట్ నిర్ణయిస్తాడు.
Executive meaning in Telugu – ఎగ్జిక్యూటివ్ అర్ధం తెలుగులో
ఎగ్జిక్యూటివ్ (Executive) అంటే తెలుగులో కార్యనిర్వాహకుడు అని అర్ధం. వ్యాపార రంగాల్లో మేనేజర్ దగ్గర కొంత మంది ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తారు. వాళ్ళు కేవలం ఆర్డర్స్ తీసుకుంటారు తప్ప వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకోరు. సాధారణ ఉద్యోగులందరూ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కి చెందుతారు.